విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు

ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జి-20 సదస్సులో భాగంగా రెండో మౌలిక సదుపాయాల కార్యవర్గ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి విశాఖపట్నం నగరం సిద్ధంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జి-20 సదస్సులో భాగంగా రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమావేశంలో రేపటి పైనాన్సింగ్ సిటీలు అన్న అంశంపై చర్చ జరుగుతుందని తెలిపారు. 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 28న ప్రతినిధుల ప్రణాళిక చర్చలు ఉంటాయని, అదేరోజు అతిథులకు డిన్నర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇటీవల విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
Tags :