విశాఖ పోర్టు రికార్డుల పరంపర

విశాఖ పోర్టు రికార్డుల పరంపర

విశాఖపట్నం పోర్ట్‌ అధారిటీ మరో అరుదైన రికార్డును సాధించింది. ఒకే రోజులో పోర్ట్‌లో అత్యధిక సరుకును హ్యాండిల్‌ చేసిన ఘనతను సాధించింది. 3,76,460 మెట్రిక్‌ టన్నుల కార్గోను హ్యాండిల్‌ చేయడం ద్వారా విశాఖపట్నం పోర్టు అథారిటీ ఈ ఘనతను సాధించిందని పోర్టు ట్రస్టు చైర్మన్‌ కె.రామ్మెహన్‌రావు తెలిపారు. అయితే విశాఖ పోర్టు ట్రస్టులో నెల రోజుల వ్యవధిలోనే వరుసుగా రెండో సారి రికార్డులను సాధించడం గమనార్హం.గత నెల 26వ తేదిన ఒక్క రోజులో రికార్డు స్ధాయిలో విశాఖపట్నం పోర్టు 3,73,544 మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా హ్యాండిల్‌ చేసి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ రికార్డును పోర్టు నెల రోజుల వ్యవధిలో మరో మారు అధిగమించింది.

ఇన్నర్‌ హార్బర్‌, అవుటర్‌ హార్బర్‌, ఎస్‌పిఎంల నుంచి 3,76,460 మెట్రిక్‌ టన్నుల సరుకును హ్యాండిల్‌ చేయడం ద్వారా ఒక్కరోజులో అత్యధిక సరుకును హ్యాండిల్‌ చేసి రికార్డ్‌ సృష్టించడం గొప్ప విషయమని పోర్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 19న పోర్టుకు వచ్చిన 22 నౌకల ద్వారా ఈ సరుకును హ్యాండిల్‌ చేశారు. ప్రస్తుతం ఈ రికార్డులను అధిగమించి విశాఖపట్నం పోర్ట్‌ అధారిటీ నూతన రికార్డును నెలకొల్పడంతో పోర్టు సాధించిన ఈ ఘనత పట్ల చైర్మన్‌ కే.రామమోహనరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్‌ దుర్గేష్‌ కుమార్‌ దుబే, సెక్రటరీ వేణుగోపాల్‌, పోర్టు విభాగాధిపతులు పాల్గొన్నారు.

 

Tags :