అమెరికాలో మన రైతు విశాలి కొణతం

అమెరికాలో మన రైతు విశాలి కొణతం

అమెరికాలో ఉంటున్నా తన తండ్రి ఆశయాలు, రైతు బిడ్డగా ఉన్న తన మూలాలను మరచిపోకుండా ఓవైపు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తూ అక్కడివారితోపాటు స్థానిక ప్రభుత్వంతో రైతుగా అధికారిక గుర్తింపును విశాలి కొణతం అందుకున్నారు. 

వర్జీనియాలోని లౌడెన్‌ కౌంటీలో ఐటీ ఫీల్డ్‌లో ఉన్న విశాలి కొణతం మొదట తన పెరట్లో కూరగాయల సాగును మొదలుపెట్టారు. భారతీయ కూరగాయలన్నీ పండిరచడం ప్రారంభించిన తరువాత వ్యవసాయం చేయడం మొదలెట్టారు. కొంత భూమిని లీజ్‌కు తీసుకొని మార్చిలో పని మొదలుపెట్టారు.  ఎకరా విస్తీర్ణంతో ఆమె వ్యవసాయం మొదలైంది తన వ్యవసాయ పొలంలో కాడ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఆమె వ్యవసాయం సాగు అందరినీ ఆకర్షించింది.

 విశాలి తన పంటను రెస్టారెంట్లకు, స్టోర్లకు కాకుండా, ఫామ్‌ టు హోమ్‌ కస్టమర్లకే అందించాలనీ అనుకుంది. దానికితోడు సేంద్రియ పద్ధతిలో ఓ భారతీయ రైతు పండిస్తున్న కూరగాయలని తెలియగానే చాలామంది నేరుగా ఆమె పొలం దగ్గరికే వస్తున్నారు. వాళ్లే తెంపుకొంటున్నారు. పొలాల్ని చూస్తున్నారు.   ఆర్డర్‌ చేస్తే హోం డెలివరీ కూడా చేస్తోంది. కాకపోతే అది చుట్టుపక్కలవారికి మాత్రమే అని విశాలి పేర్కొంది. తన సొంతూరు మోత్కూరు దగ్గర ఉన్న ఆరెగూడెం అని తన తండ్రి బక్కారెడ్డి. ఎన్ని సమస్యలొచ్చినా వ్యవసాయాన్ని వదల్లేదని చెబుతూ, తన తండ్రిలాగానే తనకు కూడా సేద్యమంటే చాలా ఇష్టమని అందుకే ఇక్కడ వచ్చినా కూడా సేద్యంపై మక్కువతో వ్యవసాయం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఆమె వ్యవసాయం చేస్తానన్నప్పుడు ఆమె భర్త శ్రీధర్‌రెడ్డి, ఆమె పెద్దక్క బిడ్డ అర్చన మద్దతు ఆమెకు లభించడంతో ఆమె ఉత్సాహంగా వ్యవసాయం ప్రారంభించారు. తన వ్యవసాయం ద్వారా తన మూలాలను నా బిడ్డలకు కూడా పరిచయం చేశానని విశాలి చెబుతోంది. 

లౌడెన్‌ కౌంటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌వారు ప్రతి సంవత్సరం పదిమంది రైతులను నామినేట్‌ చేస్తారు. ఈ ఏడాది ఆ జాబితాలో  విశాలిని భారతీయ రైతుగా గుర్తించారు. వ్యవసాయం కూడా ఒక వృత్తే అని తెలియజేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. దీంట్లో భాగంగా బుక్‌లెట్స్‌ ముద్రించి పాఠశాలల్లో పంచుతారు. వీడియోలు ప్రదర్శిస్తారు. నామినేట్‌ అయిన రైతు విద్యార్థులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి లోకల్‌ ఫుడ్‌ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. 

 

Tags :