ఆ రూమర్లకు చెక్ పెట్టిన విష్ణు విశాల్

తమిళ నటుడు విష్ణు విశాల్, తన సినిమాలతో కంటే జ్వాలా గుత్తా భర్త గానే అందరికీ పరిచయం. ఆ రకంగానే అతను ఇక్కడ ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు. తెలుగులో రిలీజైన తన మూవీస్ మట్టి కుస్తీ, ఎఫ్ఐఆర్ మంచి టాక్ అయితే తెచ్చుకున్నాయి కానీ కమర్షియల్ గా మాత్రం ఏమంత రిజల్ట్‌ని ఇవ్వలేదు.
జ్వాల భర్తగా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో ఉన్న విష్ణు, జ్వాలను పెళ్లి చేసుకున్న రెండేళ్లకే విడిపోతున్నట్లు వార్తలు రావడం బాధాకరం. కేవలం విష్ణు పెట్టిన ఓ పోస్టును జనాలు తప్పుగా అర్థం చేసుకోవడంతో ఈ రూమర్లు ఎక్కువయ్యాయి. రీసెంట్‌గా విష్ణు ఓ ట్వీట్‌లో నేనెంతో ప్రయత్నించా కానీ విఫలమవుతూను ఉన్నా. మరేం పర్వాలేదు. దాని నుంచి కూడా గుణపాఠం నేర్చుకుంటాను. ఈ ఫెయిల్యూర్ పూర్తిగా నా తప్పే. దీన్నుంచి గుణపాఠం నేర్చుకుంటా అని ట్వీట్ చేశాడు.
విష్ణు ఎప్పుడైతే ఈ ట్వీట్ చేశాడో ఇక వార్తా రాయుళ్లు వెంటనేదాన్ని వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టేశారు. ఇప్పటికే ఓ పెళ్లి విఫలై జ్వాలను విష్ణు రెండో పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటుండగా ఇలాంటి నర్మగర్భమైన ట్వీట్ వేయడంతో జనాలకు విడాకుల గురించి ఎన్నో డౌట్స్ పుట్టుకొచ్చాయి.
అయితే ఈ వార్తలన్నింటినీ చూసిన విష్ణుకు మైండ్ పోయినంత పనైపోయింది. వెంటనే ఈ చర్చ గురించి స్పందించాడు. తాను ఆ ట్వీట్ చేసింది కెరీర్ పరంగా, వృత్తిపరంగా అని, దాన్ని వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి ఎంతో దారుణంగా ప్రచారం చేశారని, తన భార్య జ్వాలతో తన జర్నీ చాలా బాగుందని, ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి నమ్మకం ఉందని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. దీంతో విష్ణు-జ్వాల విడాకుల వార్తలకు చెక్ పడింది.