‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీ ఫేక్ రిలీజ్ డేట్ దయచేసి డిలీట్ చేయండి! :వీడియో లో విశ్వక్ సేన్

మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు వెయిట్ చేయండి! : విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా థియేటర్స్‌లో రిలీజైంది. రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో ఫలానా తేదీకి రిలీజ్ కానుందంటూ వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. సినిమా ప్రమోషన్ కోసం రిలీజ్ ముందు చేసిన ప్రాంక్ వీడియో ఎంత వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు విషయం కాస్త సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కొత్త సమస్య మొదలైంది. అదేంటంటే..‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీ రిలీజ్ డేట్. సినిమా థియేటర్స్‌లో రన్ అవుతుండగానే సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీలో ఫలానా రోజు విడుదలవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా వార్తలు బయటకు రావటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మరోసారి హీరో విశ్వక్ సేన్ రంగంలోకి దిగారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన విశ్వక్ సేన్. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై కూడా స్పందించారు.
మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే తామే అధికారికంగా సదరు విషయాన్ని చెబుతామని అన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన వార్తలను దయచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండని.. చేసినా వాటిని డిలీట్ చేయాలని ఆయన కోరారు. తదుపరి విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా మాస్ కా దాస్ అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు విశ్వక్ సేన్. హీరోగా నటిస్తూనే దమ్కీ అనే ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు విశ్వక్. దీంతో పాటు స్టూడెంట్స్ జిందాబాద్ అనే సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు.
https://www.instagram.com/p/CdTIjFgpZjm/