భోగాపురానికి విశాఖ ఎయిర్‍పోర్టు

భోగాపురానికి విశాఖ ఎయిర్‍పోర్టు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. ఎయిర్‍పోర్టును తరలించిన అనంతరం ఆ స్థలాన్ని తిరిగి రక్షణ శాఖకు అప్పగిస్తామన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివ•ద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్‍పోర్టుకు కనెక్టివిటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‍పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్‍ అండ్‍ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్‍ అడ్మినిస్ట్రేషన్‍ అండ్‍ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపడతామన్నారు.

Tags :