మోదీకి పుతిన్ ఎందుకు బర్త్ డే విషెస్ చెప్పలేదో తెలుసా?

మోదీకి పుతిన్ ఎందుకు బర్త్ డే విషెస్ చెప్పలేదో తెలుసా?

షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) మీటింగ్ కోసం ఉజ్బెకిస్తాన్ వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. అయితే శుక్రవారం ఈ సమావేశం జరగ్గా.. శనివారం మోదీ జన్మదినం. దీంతో మోదీని కలిసిన పలువురు నేతలు ముందుగానే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కానీ పుతిన్ మాత్రం మోదీకి బర్త్ డే విషెస్ చెప్పలేదు. దీని గురించి పుతిన్ మాట్లాడుతూ.. తనకు ఎంతో బెస్ట్ ఫ్రెండ్ మోదీకి వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేకపోయానని అన్నారు. మోదీని కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. ‘‘మై ఫ్రెండ్.. నువ్వు శనివారం పుట్టిన రోజు జరుపుకుంటున్నట్లు తెలుపు. కానీ రష్యన్ సంప్రదాయాల ప్రకారం ముందుగా శుభాకాంక్షలు చెప్పుకోం. కాబట్టి ఇప్పుడు నీకు బర్త్‌డే విషెస్ చెప్పలేను’’ అన్నారు. అయితే స్నేహపూర్వకంగా భారత దేశానికి మాత్రం శుభాకాంక్షలు చెప్పారు. మోదీ నాయకత్వంలో భారత్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.

 

Tags :