భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు ఆయన వల్లే : ఉపరాష్ట్రపతి

భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు ఆయన వల్లే : ఉపరాష్ట్రపతి

ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పలు రంగాల్లో 20 ఏళ్ల పాటు మోదీ పనితీరుకు సంబంధించిన పలు మోదీ పనితీరుకు సంబంధించిన పలు అంశాలపై 22 మంది నిపుణులు రాసిన 21 కథనాల సంకలనం మోదీ ఎట్‌ 20. డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడడుతూ ప్రజా పోరాటాలపై లోతైన అవగాహన, కలలుగనే ధైర్యం, కృషి, అభిరుచి శక్తి, దృఢ నిశ్చయం ప్రధాని నరేంద్ర మోదీ విజయ రహస్యాలని అన్నారు. సీఎంగా గుజరాత్‌లో చేసిన ప్రయోగాల స్ఫూర్తితో దేశంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్న శాస్త్రవేత్తగా మోదీని అభివర్ణించారు. మోదీ నాయకత్వాన్ని రాజకీయ వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ మంత్రులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :