అమెరికా పర్యాటక వీసాకు.. మూడేండ్లు ఆగాల్సిందే !

అమెరికా పర్యాటక వీసాకు.. మూడేండ్లు ఆగాల్సిందే !

అమెరికాను చుట్టొద్దామని అనుకుంటున్నారా? బిజినెస్‌ పనిమీద వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు మూడేండ్లు ఆగాల్సిందే. ఎందుకంటే వీసా అపాయింట్‌మెంట్‌ కోసం దాదాపు వెయ్యి రోజుల వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నది. బీ1 (బిజినెస్‌), బీ2 (టూరిస్టు) వీసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకొంటే 2025 జూన్‌ లేదా జూలైలో అపాయింట్‌మెంట్‌ లభిస్తుంది. ఈ మేరకు ఢిల్లీ ఎంబసీతో పాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబై, కోల్‌కతా కాన్సులేట్‌ కేంద్రాల నుంచి వీసా కోసం నిరీక్షణకు సంబంధించిన సమయాన్ని అమెరికా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచించింది. దీని ప్రకారం ముంబై కాన్సులేట్‌లో బీ1, బీ2 వీసాల కోసం దరఖాస్తు చేసుకొంటే అపాయింట్‌మెంట్‌ కోసం అత్యధికంగా 999 రోజులు వేచి చూడాలిని చెబుతున్నది. ఇది హైదరాబాద్‌లో అయితే 994 రోజులు, ఢిల్లీ-961, చెన్నై 948, కోల్‌కతా 904 గా వెయిటింగ్‌ టైం ఉన్నది. అయితే బీ1, బీ2లతో పోలిస్తే ఇతర వీసాలకు అపాయింట్‌మెంట్‌ సమయం తక్కువగానే ఉన్నది.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.