విశాఖపట్నంలో 'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్ ఈవెంట్!

విశాఖపట్నంలో 'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్ ఈవెంట్!

ఆర్కే బీచ్‌ నుండి ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌కి మార్చిన నిర్వాహకులు!!

మెగా స్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజల ‘వాల్తేరు వీరయ్య’  వేదికపై అభిమానుల్లో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తొలుత విశాలమైన ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. కానీ స్పష్టమైన కారణం చెప్పకుండానే ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ గ్రౌండ్‌లోకి ఈవెంట్‌ని మారుస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. విశాఖపట్నం సీపీ మాత్రం తమని వాల్తేరు వీరయ్య టీమ్ పర్మీషన్ అడిగింది ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో వేదికకే అని క్లారిటీగా చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌‌ని విశాఖపట్నం లో నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితమే చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ వేదికపై మాత్రం అభిమానులకి వేగంగా ఓ క్లారిటీ ఇవ్వలేకపోయింది. తొలుత వైజాగ్‌లోని ఆర్కే‌బీచ్‌లో నిర్వహించబోతున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం అక్కడ ఏర్పాట్లు కూడా చేసింది. కానీ ఆ తర్వాత ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. దాంతో మెగాస్టార్ అభిమానులు తికమకకి గురవగా.. ఏపీ ప్రభుత్వం కొత్త జీవో కారణంగానే ఈ వేదికగా మార్పు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియాలో మెగాస్టార్ అభిమానులు ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. వాల్తేరు వీరయ్య వేదిక మార్పునకి స్థానిక పోలీసుల సూచన కూడా ఓ కారణమని వార్తలు రావడంతో విశాఖపట్నం సీపీ శ్రీకాంత్‌ స్పందించారు.

వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వాహకులు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లోనే ఈవెంట్‌కి రాతపూర్వకంగా అనుమతి అడిగారని చెప్పుకొచ్చిన సీపీ శ్రీకాంత్.. అక్కడే తాము పర్మీషన్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఒంగోలు వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని ఒక్క రోజు వ్యవధిలో మార్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించగా.. వాల్తేరు వీరయ్య కూడా అదే బ్యానర్‌పై వస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌తో డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వాల్తేరు వీరయ్య మూవీని తెరకెక్కించారు. ఈ మేరకు శనివారం ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో చిరంజీవి డైలాగ్స్ చెప్తూ కనిపించారు. అలానే రవితేజ కూడా విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా చిరంజీవిని ఢీకొట్టబోతున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

 

 

 

 

Tags :