అమెజాన్ ఆఫర్.. రూ.1.20 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం

అమెజాన్ ఆఫర్.. రూ.1.20 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం

తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్‌రెడ్డి, వసంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు అనీష్‌కుమార్‌ రెడ్డి అమెరికాలో అమెజాన్‌ సంస్థలో ఏడాదికి రూ.కోటి 20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అనీష్‌కుమార్‌ రెడ్డి పదవ తరగతి వరకు హైదరాబాద్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలల్లో, ఇంటర్‌ విద్యను శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్‌ (సీఎస్‌) గీతం యూనివర్సిటీ హైదరాబాద్‌, ఎంఎస్‌ను అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీలో పూర్తి చేసి ఉద్యోగం సాధించారు. ఏడాదికి రూ.1.20 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

 

Tags :