ఎన్టీఆర్ వెబ్సైట్ను ప్రారంభించిన చంద్రబాబు

నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో శత జయంతి ఉత్సవ సంఘం 100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం పేరుతో వెబ్సైట్ను రూపొందించింది. దాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ ఈ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల నుంచి డిజిటల్ సంతకాలను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ తరాలపాటు జనం గుండెల్లో నిలిచిపోయే మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కనపర్తి రవిప్రసాద్, కార్యదర్శి తుమ్మల రమేష్, సభ్యులు పాల్గొన్నారు.
Tags :