కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ కు మరో పతకం

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ కు మరో  పతకం

బర్మింగ్‌హోమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌ 109 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్‌ లవ్‌ప్రీత్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. స్నాచ్‌లో 163  కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 192 కేజీలు.. మొత్తం 355 కేజీలు ఎత్తి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ రికార్డును నెలకొల్పడం విశేషం. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 14కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.

 

Tags :