బే ఏరియాలో ‘వేటా’ బతుకమ్మ పండుగకు మంచి స్పందన

బే ఏరియాలో ‘వేటా’ బతుకమ్మ పండుగకు మంచి స్పందన

తెలంగాణ పూల పండుగైన బతుకమ్మ వేడుకలు కాలిఫోర్నియాలో ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌(వేటా) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు అంచనాలకు మించిన మహిళలు హాజరయ్యారు. అక్టోబరు 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కన్నుల పండువగా ఈ వేడుకలను ఆటాపాటలతో నిర్వహించారు. తెలంగాణ పూల పండుగైన బతుకమ్మ వేడుకలు అమెరికాలో కాలిఫోర్నియాలో ఘనంగా నిర్వహించారు. ఒక్కొసి పువ్వేసి చందమామ, ఏమేమీ పువ్వొప్పునే గౌరమ్మ అంటూ తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను కొలుస్తూ మహిళలు సంబరంగా ఈ వేడుకలు నిర్వహించారు. కాలిఫోర్నియా, శాన్‌ రామన్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 200 మందికి పైగా హాజరవుతారని తొలుత అంచనా వేశారు. అయితే, బతుకమ్మ సంబరాల్లో 600లకు తెలుగు వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని సంబరాలకు కొత్త అందం తీసుకువచ్చారు.

‘ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌’ వ్యవస్థాపక అధ్యక్షురాలు ‘శ్రీమతి రaాన్సీ రెడ్డి హనుమాండ్ల’, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ శైలజ కల్లూరి, కార్యదర్శి అనురాధ ఆలిశెట్టి, సంయుక్త  కార్యదర్శి ప్రశాంతి కూచిభొట్ల, మీడియా సమన్వయకర్త సుగుణ రెడ్డి, కల్చరల్‌ చైర్‌ రత్నమాల వంకా, ప్రాంతీయ సమన్వయకర్త హైమ అనుమాండ్ల, కోశాధికారి విశ్వ, వైస్‌ ప్రెసిడెంట్‌ యశశ్విని రెడ్డి, సంయుక్త కోశాధికారి జ్యోతి, కమ్యూనిటీ సర్వీస్‌ చైర్‌, కాలిఫోర్నియా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ లక్ష్మి యనమండల, శాక్రిమెంటో ప్రాంతీయ సమన్వయకర్త పూజ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

Click here to Event Gallery

 

Tags :