వేటా నూతన కార్యవర్గం

బే ఏరియాలో మహిళల కోసం ఏర్పడిన ఉమెన్ ఎంపవర్‍మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) కొత్త కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు, సలహాదారు, ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రెసిడెంట్‍గా శైలజ కల్లూరి, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్, వాషింగ్టన్ డీసీ నుంచి కూడా ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఆన్‍లైన్ మాధ్యమంగా జరిగింది. ఫౌండర్ చైర్ పర్సన్ ఝాన్సీ రెడ్డి, సహ చైర్ పర్సన్ అభికొండలు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అన్నిరకాలు అవకాశాలు కల్పించి, వారిలోని కళలను సాకారం చేసుకోవడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని అన్నారు. నూతన ప్రెసిడెంట్ శైలజ కల్లూరి మాట్లాడుతూ ఈరోజు నామినేటేట్ కార్యవర్గ సభ్యులందరు ప్రమాణ స్వీకారం చేయడానికి సమావేశం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ సంస్థ మహిళా సాధికారికత కోసం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే సంవత్సరంలో చేయాలనుకుంటున్న కార్యక్రమాలన్ని ఇప్పటి నుంచే తగిన విధంగా ప్లాన్ చేసుకుంటామని అన్నారు.