MKOne Telugu Times Youtube Channel

వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్

వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో కొత్తగా ఎడిట్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. పొరపాటున తప్పుగా పంపిన సందేశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఈ మేరకు ఎడిట్‌ బటన్‌ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాట్సాప్‌ యాజమాన్యం ప్రకటించింది. రాంగ్‌ మెసేజ్‌లు ఎడిట్‌ చేసుకోవడానికి తొలి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. సందేశం తప్పుగా వెళ్లినట్లు భావిస్తే దాన్ని మొత్తం తొలగించాల్సిన అవసరం లేదు.  మార్పులు చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజర్లకు చాటింగ్‌పై మరింత కంట్రోల్‌ లభిస్తుందని యాజమన్యం తెలియజేసింది. 

 

 

Tags :