త్వరలోనే వాట్సాప్ కొత్త ఫీచర్

త్వరలోనే వాట్సాప్ కొత్త ఫీచర్

మోటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మెసేజ్‌ యువర్‌సెల్ఫ్‌ అనే సరి కొత్త ఫీచర్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తమకు తామే మేసేజ్‌లు పంపుకోవచ్చు. నోట్‌, రిమైండర్స్‌, అప్‌డేట్స్‌, పాస్‌ వర్డ్స్‌ సహా ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని వినియోగాదరులు తమకు వాట్సాప్‌కు మెసేజ్‌ పంపుకొని, భద్రపరుచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం వాట్సాప్‌ అప్లికేషన్‌లోకి వెళ్లి క్రియేట్‌ న్యూ చాట్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం పైన కనిపించే సొంత కాంటాక్ట్‌ నంబర్‌పై క్లిక్‌ చేసి, మెసేజ్‌లు పంపుకోవచ్చు. రాబోయే వారాల్లో ఈ కొత్త ఫీచర్‌ను అండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ వెల్లడించింది. 

 

 

Tags :