కొత్త ఫీచర్ లను జోడించిన వాట్సాప్

కొత్త ఫీచర్ లను జోడించిన వాట్సాప్

వాట్సాప్‌ తాజా వెర్షన్‌పై ఎమోజీ రియాక్షన్స్‌ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషంగా ఉందని వాట్సాప్‌ ప్రకటించింది. వాట్సాప్‌లో ఇంత వరకు యూజర్లు ఒక్క విడత 100 ఎంబీ వరకే ఫైల్స్‌ (ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు) పంపించుకునేందుకు అవకావం ఉండేది. దీని వల్ల పంపించవలసిన ఫైల్స్‌ ఎన్నో ఉన్నప్పుడు చాలా సమయం వృథా అయ్యేది. ఇప్పుడు ఈ పరిమితి 2జీబీకి పెరిగింది. అంటే ఒక విడత 2జీబీ డేటాను మరొకరితో షేర్‌ చేసుకోవచ్చు. అంతేకాదు ఫైల్‌ అప్‌లోడ్‌ లేదా డౌన్‌లోడ్‌కు ఎంత సమయం పడుతుందన్నది కూడా ఆ సమయంలో చూపిస్తుంది. ఒక గ్రూప్‌లో గరిష్ఠంగా 256 మంది సభ్యులకే ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఇంతకు మించి సభ్యులు ఉన్నప్పుడు వేరే గ్రూప్‌ తెరవాల్సి వచ్చేది. ఇక మీదట 512 మంది సభ్యులు ఒకే గ్రూప్‌లో చేరవచ్చు. పరిమితి రెట్టింపైంది.

 

Tags :