వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్‌ సంస్థ మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది.  వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపాలంటే అక్షరాలను టైప్‌ చేస్తాం. పంపాల్సిన సందేశం పెద్దగా ఉంటే అన్ని అక్షరాలు టైప్‌ చేయాలంటే చిరాకు. ఇలా వాట్సాప్‌లో టైప్‌ చేయడానికి కష్టంగా భావించే వారి కోసం ఆ సంస్థ కొత్త ఫీచర్‌ తీసుకొస్తోంది సందేశాన్ని వాయిస్‌ రూపంలో రికార్డు చేస్తే అది అక్షరాల రూపంలోకి మారిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ అభివృద్ధి చేస్తోందని తెలిసింది. వాట్సాప్‌లో ఆప్షనల్‌  ఫీచర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌కు ఈ ఫీచర్‌ను ఆపిల్‌ సంస్థ అందిస్తోంది.

 

Tags :