భారతీయులకు గుడ్‌న్యూస్‌... అమెరికాలో

భారతీయులకు గుడ్‌న్యూస్‌... అమెరికాలో

అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు మేలు చేకూర్చే ప్రక్రియ మరో అడుగు ముందుకు పడిరది. ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డు ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఈగిల్‌) యాక్ట్‌-2022ను అమెరికా అధ్యక్ష భవనం ఓకే చెప్పింది. బిల్లుపై ఈ వారంలోనే అక్కడి పార్లమెట్‌ దిగువ సభలో ఓటింగ్‌ చేపట్టనున్నారు.  ఇన్నాళ్లూ ప్రతి సంవత్సరంలో జారీచేసే గ్రీన్‌కార్డులో ఒక్కో దేశానికి సంబంధించిన  నిర్దిష్ట సంఖ్యలోనే కార్డులు ఇస్తారు.  ఎవరికైనా అధిక వృతి నైపుణ్యాలు ఉన్నాసరే అప్పటికే ఆ దేశ కోటా పూర్తయితే వారికి గ్రీన్‌ కార్డు అమెరికా ఇవ్వలేకపోతోంది.  ఈ పరిమితిని ఎత్తేస్తోంది. అంటే ఏ దేశంలో పుట్టాడనే అంశంతో సంబంధం లేకుండా అత్యున్నత వృతి నైపుణ్యం గల వ్యక్తులను ఒక దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో తీసుకునేందుకు ఈగల్‌ చట్టం అవకాశం కల్పిస్తుంది.

 

 

Tags :