ఆఫ్రికా, అమెరికా మినహా... మిగతా చోట్ల తగ్గుముఖం

ఆఫ్రికా, అమెరికా మినహా... మిగతా చోట్ల తగ్గుముఖం

ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లో మినహా మిగతా అన్ని చోట్లా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారంలో కొత్త కేసులు 12 శాతం మరణాలు, 25 శాతం మేర తగ్గినట్లు అందులో వివరించింది. మార్చి నుంచే కేసుల తగ్గుదల ఆరంభమైనట్లు తెలిపింది. అయితే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో 14 శాతం, ఆఫ్రికా ఖండంలో 12 శాతం మేర కేసులు పెరుగుతున్నట్టు విశ్లేషించింది. మొత్తంగా చూస్తే 50 దేశాల్లో కేసుల్లో పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు.  ఒమిక్రాన్‌ కారణంగా ఉద్భవించిన కొత్త వేరియంట్ల కారణంగానే కేసులు పెరుగుతున్నట్టు తెలిపారు.

 

Tags :