MKOne TeluguTimes-Youtube-Channel

వాస్తవాన్ని మరవొద్దు రానున్న రోజుల్లో ... మరిన్ని వేవ్ లు తప్పవు

వాస్తవాన్ని మరవొద్దు రానున్న రోజుల్లో ... మరిన్ని వేవ్ లు తప్పవు

చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. కొంత కాలంగా వైరస్‌ వ్యాప్తికి కొవిడ్‌ ఆంక్షల సడలింపుతో పాటు అనేక కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు  వ్యాప్తిలో ఉన్నాయనే వాస్తవాన్ని మరవొద్దని రానున్న రోజుల్లో మరిన్ని వేవ్‌లు తప్పవని హెచ్చరించింది. చైనాలో కొవిడ్‌ ఉధృతికి గల కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మరియా వాన్‌ కెర్ఖోవో స్పందిస్తూ ..ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వేవల్‌కు దారితీయవచ్చు. ఒమిక్రాన్‌ లోని కొన్ని వేరియంట్లకు రోగనిరోధకత నుంచి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళనకర విషయం. అయిన వీటీపై పోరాడేందుకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవడం ఉపశమనం కలిగించే అంశం. కొవిడ్‌ ప్రభావం తగ్గిన తీరును చూశాం. ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరగడమే అందుకు కారణం. ప్రస్తుతం చైనాతో పాటు ఇతర దేశాల్లో వృద్ధులు, రోగనిరోధకత తక్కువగా ఉండేవారితో పాటు ముప్పు అధికంగా ఉండే  ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాల్సి అవసరం ఉంది. అయితే  ప్రస్తుతం చైనాలో కరోనా ఉధ్తృతి పెరుగుతున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్‌తో పాటు తీవ్ర అనారోగ్యం బారినపడిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన ఔషధాలు, వైద్య పడకలు అక్కడ అందుబాటులో ఉంచుకోవాలని అని వాన్‌ కెర్ఖోవ్‌ వెల్లడించారు. 

 

 

Tags :