కరోనాలో మరో కొత్త వేరియంట్

కరోనాలో మరో కొత్త వేరియంట్

ప్రపంచమంతా డెల్టా వేరియంట్‍ గురించి భయపడుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) ఆందోళనకర ప్రకటన చేసింది. కరోనాలో మరో కొత్త మూ/బీ.1.621 వేరియంట్‍ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇది వ్యాక్సిన్‍ కల్పించే రక్షణను తప్పించుకొని మరీ దాడి చేయగలదని వీక్లీ బులెటిన్‍లో పేర్కొన్నది. దీనిని జనవరిలో కొలంబియాలో మొదటిసారి గుర్తించినట్టు తెలిపింది. దక్షిణ అమెరికా, యూరప్‍లో ఈ కేసులు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నది. కొలంబియా, ఈక్వెడార్‍లలో ఆందోళనకర స్థాయిలో ఈ వేరియంట్‍ వ్యాప్తి ఉన్నదని తెలిపింది.

 

Tags :