ప్రెషర్లకు విప్రో షాక్... 452 మందిని

ప్రెషర్లకు విప్రో షాక్... 452 మందిని

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ప్రెషర్లపై వేటు వేసింది. పనితీరు సరిగా కనబరచని 452 మందిని తొలగించింది. శిక్షణ తర్వాత కూడా పనితీరు మెరుగుపరుచుకోవడంలో విఫలమైనందుకు వారిని ఇంటికి పంపించింది. ప్రెషర్ల తొలగింపును విప్రో సైతం అధికారికంగా ధ్రువీకరించింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలను పాటిస్తుందని, పని ప్రదేశంలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకూ  ఈ నియమం వర్తిస్తుందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. వేరే కంపెనీకి సైతం పనిచేస్తున్నారన్న కారణంతో గతంలో 300 మందిని విప్రో తొలగించింది.  కొత్తగా మూడో త్రైమాసికంలో 600 మందిని చేర్చుకున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లోనూ నియామకాలు కొనసాగిస్తామని విప్రో తెలిపింది.

 

 

Tags :