అమెరికాలో ఘోర ప్రమాదం

అమెరికాలో ఘోర ప్రమాదం

అమెరికాలో క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలో క్రిస్మస్‌ పండగకి ముందు పరేడ్‌ను నిర్వహించడం ఆనవాయితీ. విస్కన్‌సిస్‌ రాష్ట్రంలో మిల్‌వాకీ శివారులోని వాకీషా టౌన్‌లో భారత కాలమానం ప్రకారం అదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ పరేడ్‌ని నిర్వహించారు. వందల మంది వరుసలో పాటలు పాడుకుంటూ నెమ్మదిగా రోడ్డుపై ర్యాలీగా వెళ్తున్నారు. వేల మంది రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఆ పరేడ్‌ తిలకిస్తున్నారు. ఇంతలో హటాత్తుగా ఎరుపురంగులో ఉన్న ఒక ఎస్‌యూవీ కారు పరేడ్‌పైకి దూసుకెళ్లింది. వరుసలో నడుస్తున్న వారికి ఢీ కొట్టి ముందుకు వెళ్లింది. దీంతో ఘటన స్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు.

 

Tags :