ఉదయభాను యాంకర్‌గా వేటా బతుకమ్మ వేడుకలు

ఉదయభాను యాంకర్‌గా వేటా బతుకమ్మ వేడుకలు

ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (వేటా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వివిధ చోట్ల నిర్వహిస్తున్నారు. వర్జీనియా, కాలిఫోర్నియా, న్యూజెర్సిలలో వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు రaాన్సీరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయని ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ శైలజ కల్లూరి తెలిపారు. వర్జీనియాలో 25వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు బతుకమ్మ వేడుకలను ఎస్‌వి లోటస్‌ టెంపుల్‌ మెయిన్‌ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్టోబర్‌ 1న కాలిఫోర్నియాలోని శాన్‌రామన్‌ స్పోర్ట్స్‌ పార్క్‌లో, అక్టోబర్‌ 2న న్యూజెర్సిలోని శ్రీసాయి బాలాజీ టెంపుల్‌, కల్చరల్‌ సెంటర్‌లో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ యాంకర్‌ ఉదయభాను ఈ వేడుకల్లో పాల్గొని యాంకరింగ్‌ చేయడంతోపాటు అందరినీ ఉత్సాహపరిచేలా మాట్లాడనున్నారని తెలిపారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు కూడా ఉంటాయి. మ్యూజిక్‌, డ్యాన్స్‌లోపాటు హుషారెత్తించే కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మీడియా పార్టనర్‌గా తెలుగుటైమ్స్‌ వ్యవహరిస్తోంది.

 

 

Tags :