కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్‍ డిఫెన్స్ అకాడమీ (ఎన్‍డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్‍డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి తగిన సమయం అవసరమని కేంద్రం పేర్కొంది. ఎన్‍డీఏ పరీక్షలకు మహిళలకు అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టు  గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు మహిళలను ఎన్‍డీఏ పరీక్షకు అనుతించాలంటూ మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 

Tags :