అమెరికాపై భారత్ గెలుపు

అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు ఖాతాలో ఐదో విజయం చేరింది. అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4-2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరపున దీప్ గ్రేస్ ఎక్కా (31వ ని.లో). నవనీత్ కౌర్ (32వ ని.లో), సోనిక (40వ ని.లో) వందన కటాయిరాయ (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. అమెరికా జట్టు డానియెలా గ్రెగా (28వ ని.లో) గోల్‌తో ఖాతా తెరువగా.. నటాలీ కొనెర్త్ (45వ ని.లో) రెండో గోల్ అందించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
Tags :