మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో చిత్తుగా ఓడిన యూఎస్ జట్టు

మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో చిత్తుగా ఓడిన యూఎస్ జట్టు

ఐసీసీ మహిళల టీ20 క్వాలిఫైయర్లలో భాగంగా యూఎస్ఏ మహిళలు, ఐర్లాండ్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ ఒకానొక దశలో 66/3 స్కోరుతో పటిష్టస్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత మిడిలార్డర్ దారుణంగా విఫలమవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 91 ఓవర్లకు ఆలౌట్ అయింది. యూఎస్ జట్టులో దిశ ధింగ్ర (23), సింధు శ్రీహర్ష (25) మాత్రమే ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో అదరగొట్టిన ఐర్లాండ్ మహిళలు 13.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఐర్లాండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే 13వ ఓవర్లో యూఎస్ స్పిన్నర్ సాయి తన్మయి ఎయ్యూని.. తన గూగ్లీతో ఐర్లాండ్ ఓపెనర్ ఎమీ హంటర్ (43)ను బౌల్డ్ చేసింది. అయితే మరో ఓపెనర్ గేబీ లూయిస్ (44 నాటౌట్) లాంఛనం పూర్తి చేయడంతో ఐర్లాండ్ సునాయాస విజయం నమోదు చేసింది.

 

Tags :