అట్టహాసంగా డబ్ల్యూఈఎఫ్ సభ ప్రారంభం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైన 35వ డబ్ల్యూఈఎఫ్ వార్షిక శిఖరాగ్ర సభలో పలు దేశాల అధినేతలు, అధికారులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్నారు. భారతదేశం నుంచి 100 మందితో కూడిన ప్రతినిధి బృందం వచ్చింది. అయిదు రోజుల పాటు జరిగే సభలో 52 దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, నాటో ప్రధాన కార్యనిర్వాహకులు కూడా సభలో ప్రసంగిస్తారు. భారత్ నుంచి నలుగురు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, స్మృతీ ఇరానీ, ఆర్.కె.సింగ్‌లు పాల్గొంటున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు, ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా కూడా ఈ డబ్ల్యూఈఎఫ్‌లో పాల్గొనున్నారు.
Tags :