గౌతం అదానీకి షాక్.. 24 గంటల్లో

గౌతం అదానీకి షాక్.. 24 గంటల్లో

ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, గౌతం అదానీ నాలుగో స్థానానికి పడిపోయారు. తాజా బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో అదానీ ఈ జాబితాలో మూడో స్థానం నుంచి ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నారు. గత 24 గంటల్లో అదానీ నికర విలువ 872 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. గత ఏడాది జనవరి 24, 2022 నుంచి అదానీ 683 మిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారం  ఫ్రెంచ్‌ విలాసవంతమైన బ్రాండ్‌ లూయిన్‌ విట్టన్‌ వ్యవస్థాపకుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మొత్తం నికర విలువ 188 బిలియన్‌ డాలర్లు టాప్‌లో ఉన్నాడు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ 45 బిలియన్‌ డాలర్లతో నికర విలువతో రెండో స్థానంలో ఉండగా, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ 121 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 84.7 బిలియన్‌ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే పన్నెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు.  అంతకుముందు ముఖేష్‌ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.

 

 

Tags :