ప్రపంచ శాంతి పరిరక్షణకు మా వంతు ప్రయత్నం

ప్రపంచ శాంతి పరిరక్షణకు మా వంతు ప్రయత్నం

ప్రపంచ శాంతి పరిరక్షణకు మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలో జిన్‌పింగ్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. మిగిలిన దేశాలు కూడా బాధ్యతాయుత పాత్ర పోషించి, సంక్షోభానికి సరైన పరిష్కారం లభించేలా చూడాలని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. వాస్తవాలు, చారిత్రక సత్యాలను పరిగణనలోకి తీసుకుని ఉక్రెయిన్‌ విషయంలో మేం స్వతంత్ర వైఖరిని అనుసరిస్తున్నాం. ప్రపంచ ఆర్థిక పురోగతి నిలకడగా ఉండేందుకు పాటుపడుతున్నాం అని అన్నారు.

 

Tags :