ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు.. సీఎం వైఎస్ జగన్ కు సత్కారం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు.. సీఎం వైఎస్ జగన్ కు సత్కారం

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన తమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి న్యాయం చేశారని గుంటూరు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పేర్కొన్నారు. తమ భూములకు ప్రభుత్వం తరపున రూ.30 కోట్ల పరిహారం చెల్లించడం ద్వారా ఇచ్చిన మాటను వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో యడవల్లి దళిత రైతులు శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌ను సత్కరించారు.

 

Tags :