మేం పరిశ్రమలకు కాదు.. వాటికి మాత్రమే వ్యతిరేకం

మేం పరిశ్రమలకు కాదు.. వాటికి మాత్రమే వ్యతిరేకం

మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, కేవలం కెమికల్‌ పరిశ్రమలకు మాత్రమే వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు రానివ్వకుండా టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంతో ఆయన స్పందించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కెమికల్‌ పరిశ్రమలను మేం వ్యతిరేకించాం. గతంలో జగన్‌ కూడా బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలను వ్యతిరేకించారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలను వ్యతిరేకిస్తూ జగన్‌ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగులు మా దగ్గర ఉన్నాయి. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలను మేము కాదు, స్థానిక ప్రజలూ వ్యతిరేకిస్తూన్నారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమల వల్ల గాలి కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది అని యనమల పేర్కొన్నారు. 

 

Tags :