రివ్యూ : సరి కొత్త కోణం లో 'యశోద'  

రివ్యూ : సరి కొత్త కోణం లో 'యశోద'  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : శ్రీ దేవి మూవీస్
నటీనటులు : సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ,
సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు
ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
సంగీత దర్శకులు: మణి శర్మ, నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకులు : హరి – హరీష్
విడుదల తేదీ : 11.11.2022

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను గ్లామర్ గా  తన న‌ట‌న‌తో మెప్పిస్తూ త‌న‌కంటూ ఓ ఇమేజ్‌, క్రేజ్ ద‌క్కించుకున్న స్టార్  హీరోయిన్ స‌మంత‌.  ఇప్పుడు ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కే ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇంత‌కు ముందు ఆమె చేసిన యూ ట‌ర్న్‌, ఓ బేబి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాల‌ను సాధించాయి. ఆ కోవ‌లో స‌మంత చేసిన మ‌రో మ‌హిళా ప్రాధాన్య‌త చిత్ర‌మే ‘యశోద’. అయితే ఈసారి ఆమె ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రయత్నం చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. సరోగసీ (అద్దె గ‌ర్భం) వెనుక జరిగే క్రైమ్ పాయింట్‌తో ‘యశోద’ సినిమా రూపొందిందని టీజర్, ట్రైలర్‌ను చూస్తే అర్థమైంది. ఈ సినిమా ద్వారా పరిచయం అయిన జంట దర్శకులు హరి, హరీష్ ఆ కోణాన్ని ఏ విధంగా  ప్రెజెంట్ చేశారు? స‌మంత టైటిల్ పాత్ర‌కు న్యాయం చేసిందా? లేదా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చుడండి!

కథ :

య‌శోద (స‌మంత‌) త‌న చెల్లెల‌ను కాపాడుకోవ‌టానికి స‌రోగ‌సీ అమ్మ‌గా ఉండ‌టానికి ఒప్పుకుంటుంది. అందుకోసం ఆమెకు భారీ మొత్తం డ‌బ్బులు ముడుతాయ‌ని ముందుగానే డీల్ కుదురుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో భాద పడుతున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లిగా మారడానికి మధు (వరలక్ష్మి శరత్ కుమార్ ) అండ్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) ఒప్పిస్తుంటారు. అయితే అలాంటి   స‌రోగ‌సీ సెంట‌ర్‌కు య‌శోద వెళుతుంది, అక్క‌డ త‌న‌లాగే చాలా మంది అమ్మాయిలు ఉండ‌టాన్ని ఆమె గ‌మ‌నిస్తుంది. అంద‌రూ ఏదో ఒక ర‌కంగా త‌మ ఆర్థిక స‌మ‌స్య‌ను తీర్చుకోవాల‌నే ఉద్దేశంతో స‌రోగ‌సీకి ఒప్పుకుని వ‌చ్చార‌ని యశోద తెలుసుకుంటుంది. అక్క‌డే డాక్ట‌ర్‌గా ఉంటున్న గౌత‌మ్ తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. రాను రాను అక్క‌డున్న అమ్మాయిలు పిల్ల‌ల్ని క‌న‌టానికి నొప్పుల‌తో బ‌య‌ట‌కు వెళ‌తారు. కానీ మ‌ళ్లీ క‌న‌ప‌డ‌రు. అవ‌న్నీ య‌శోద‌కు అనుమానాన్ని రేకెత్తిస్తాయి. దాంతో ఆమె త‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకుందామ‌ని ప్ర‌య‌త్నం చేస్తుంది. అందులో ఆమెకు తెలిసే విస్తుపోయే నిజాలేంటి? న‌గ‌రానికి ఆరు నెల‌ల‌కు ఓసారి ధ‌నికులైన అమ్మాయిలు, హాలీవుడ్ తార‌లు ఎందుకు వ‌చ్చి వెళుతుంటారు? వారి వెనుకున్న క్రైమ్‌కి, స‌రోగ‌సీ సెంట‌ర్‌కి ఉన్న లింకేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు:

ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం స‌మంత‌, తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టిస్తూ క్రేజ్ పెంచుకుంటున్న స‌మంత చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా ఇది. టైటిల్ పాత్ర‌లో స‌మంత హండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేసింది. అమ్మ‌త‌నంలోని గొప్ప‌ద‌నాన్ని ప‌ట్టించుకోకుండా చాలా మంది దాన్ని ఒక బిజినెస్ యాంగిల్‌లో చూస్తూ క్రైమ్ చేస్తున్నారు. అలాంటి వారి తీరుని త‌ప్పు ప‌ట్టే అమ్మాయి పాత్ర‌లో స‌మంత చ‌క్క‌గా న‌టించింది. ఫస్ట్ హాఫ్ లో అమాయక యువతిగా.. సెకండ్ హాఫ్ లో అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే ఆమె యాక్షన్.. ఆమె పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయాయి. పైగా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తోనే సమంత కొన్ని భావోద్వేగ సన్నివేశాలను చాలా చక్కగా పడించింది. పెర్ఫామెన్స్ ప‌రంగానే కాదు.. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ ఆమె అద్భుతంగా న‌టించింది. ఐదు నెల‌ల మ‌హిళ ఎలా ఫైట్స్ చేస్తుంద‌నే సందేహం చాలా మందికి రావ‌చ్చు. కానీ.. ఐదు నెల‌లు గ‌ర్భంతో ఉన్న మ‌హిళ యాక్ష‌న్ చేసిన సంద‌ర్భాలున్నాయ‌న్న ప‌రిశీలించుకున్న త‌ర్వాతే.. ద‌ర్శ‌కులు హాలీవుడ్ యాక్ష‌న్ మాస్ట‌ర్‌తో పోరాట స‌న్నివేశాల‌ను డిజైన్ చేయించుకున్నారు. ఇక సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వ‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ స్టైలిష్‌గా క‌నిపిస్తూ, గ్రే షేడ్స్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎలివేట్ చేసిన తీరు మెప్పించింది. ఇలాంటి పాత్ర‌ల‌ను మించిన విల‌నిజాన్ని ఇది వ‌ర‌కే చేసిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్, య‌శోద సినిమాలో పాత్ర‌ను చ‌క్క‌గా క్యారీ చేసింది. ఉన్ని ముకుంద‌న్ పాత్ర‌లోనూ వేరియేష‌న్స్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తమ నటనతో మెప్పించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

డైరెక్టర్స్ హరి, హరీష్ సరోగసీలో క్రైమ్ ఎలా ఉంటుందనే దాన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని చక్కగా తెరకెక్కించారు. సినిమాను రెండు పార్శ్వాలుగా రన్ చేస్తూ దానికి సరోగసీలోని క్రైమ్‌ని లింకు పెడుతూ ఎగ్జయిటింగ్‌గా మలిచే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ కొన్ని సీన్స్, సెకండాఫ్‌లో మెయిన్ కథలోని బ్రేకింగ్ పాయింట్ రివీల్ తర్వాత సినిమాను నడిపిన తీరు డ్రాగింగ్‌గా అనిపించింది. మణిశర్మ నేపథ్య సంగీతం, సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. సన్నివేశాలకు తగ్గట్లు పులగం చిన్నారాయణ, డా.చల్లా భాగ్యలక్ష్మి మంచి సంభాషణలను అందించారు. ‘ఆదిత్య 369’ వంటి క్లాసిక్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. సినిమాపై ఆయన ప్యాషన్ తెరపై కనిపిస్తుంది.

విశ్లేషణ:

స‌రోగ‌సీ అనేది వైద్య రంగం వ‌ల్ల మాన‌వ జీవితాల్లోకి పెను మార్పుల‌నే తీసుకొచ్చింది. చాలా మంది సంతాన‌లేమితో బాధ‌ప‌డేవారు. ఆ వైద్య విధానం వ‌ల్ల త‌ల్లిదండ్రులుగా మారి సంతోషంగా ఉన్నారు. అయితే ఇది ఓ కోణం మాత్రమే. అయితే దీనిలోని మ‌రో కోణం.. అంటే స‌రోగ‌సీ పేరుతో జ‌రిగే క్రైమ్ కోణాన్ని ఎలివేట్ చేయడానికి యశోద చిత్రంతో ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం స‌మంత‌. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టిస్తూ క్రేజ్ పెంచుకుంటున్న స‌మంత చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా ఇది. ఓ సోషల్ ఇష్యూకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ తీసుకున్నారు. అలాగే ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలో గుడ్ ఎమోషన్స్, బెటర్ స్క్రిప్ట్, మరియు బెస్ట్ ఫీల్ ఉంది. అలాగే సమంత నటన ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోంది. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, సినిమాలో కంటెంట్ అండ్ ట్రీట్మెంట్ బాగుంది. మొత్తమ్మీద ఈ చిత్రం  మెప్పిస్తోంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.