తెలంగాణలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పర్యటన

తెలంగాణలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పర్యటన

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా శ్రీకారం చుట్టారు. తన ప్రచారాన్ని కేరళ నుంచి ఆయన ప్రారంభించారు. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. తనకు మద్దతుగా ఓటేయాలని వారిని సిన్హా కోరారు. తర్వాత తమిళనాడులో పర్యటించనున్నారు. జులై 1న ఛత్తీస్‌గఢ్‌, 2న తెలంగాణలో పర్యటించనున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు. అయితే యశ్వంత్‌ సిన్హాకే టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Tags :