విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఖరారు చేశారు. ఈ మేరకు జైరాం రమేష్ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 2002లో కేంద్ర విదేశాంగ మంత్రిగా యశ్వంత్ సిన్హా పనిచేశారు. 2018లో యశ్వంత్ సిన్హా బీజేపీకి రాజీనామా చేశారు. 2021లో తృణమూల్లో చేరారు. కాయస్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యశ్వంత్ సిన్హా టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Tags :