27న రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్

27న  రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా  నామినేషన్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌  సిన్హా పేరు ఖరారైన సంగతి తెలిసిందే. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్యంత్‌ సిన్హా పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో జూన్‌ 27న ఉదయం 11:30 గంటలకు యశ్వంత్‌ సిన్హా తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. యశ్వంత్‌ సిన్హాకు ఇప్పటి వరకు 22 పార్టీలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. 21న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

 

Tags :