26 నుంచి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర

26 నుంచి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర

వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30వ తేదీతో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని రీతిలో అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించి సామాజిక మహా విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాత టీడీపీ హయాంలో జరిగిన సామాజిక అన్యాయం, గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని చాటి చెప్పేలా ఈ నెల 26 నుంచి 29 వరకు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులతో బస్సు యాత్ర చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక భేరి బస్సు యాత్ర  ఈనెల 26న ఉత్తరాంధ్రలో ప్రారంభమై ముఖ్యమైన నగరాలు, పట్టణాలు, ప్రాంతాల మీదుగా సాగుతూ 29వ తేదీన అనంతపురం చేరుకుని అక్కడే ముగుస్తుంది. బస్సు యాత్ర సందర్భంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు.

 

Tags :