రాష్ట్రపతి ఎన్నికపై సీఎం జగన్ నిర్ణయం : విజయసాయిరెడ్డి

రాష్ట్రపతి ఎన్నికపై సీఎం జగన్ నిర్ణయం : విజయసాయిరెడ్డి

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ వైఖరిపై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్న విజయసాయి సంబంధిత నివేదికను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈడీ విచారణపై స్పందించారు. కేంద్రం కక్ష సాధింపేమీ చేయడం లేదని అన్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు  అనుభవించాల్సిందేనని అన్నారు.

 

Tags :