హిమాలయన్ యోగి శ్రీ కిరణ్ చుక్కపల్లి గారిచే యోగా శిబిరం

హిమాలయన్ యోగి శ్రీ కిరణ్ చుక్కపల్లి గారిచే యోగా శిబిరం

చికాగో ఆంధ్ర సంఘం జూలై 31, 2022 న హిమాలయన్ యోగి శ్రీ కిరణ్ చుక్కపల్లి గారిచే యోగా శిబిరాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో విన్యాస యోగ అనుక్రమణ సాధనలో పాటించాల్సిన మెళకువలు జాగ్రత్తలు నేర్పుతూ, ఒక ఆసనం నుండి తరువాతి ఆసనంలోకి సరిగా సులువుగా మారే విధానాన్ని చక్కగా వివరించారు. ఈ విషయాలను సూర్య నమస్కారముల సాధన ద్వారా సుళువుగా అర్ధమయ్యే విధంగా అందరిచే అభ్యసింపజేశారు. అంతేకాకుండా సరైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల పద్ధతి గురించి, యోగ నిద్ర వల్ల కలిగే లాభాల గురించి అర్థమయ్యేలా వివరించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సభ ముగించారు.

ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర సంఘం మరియు సంఘ సేవా విభాగమైన చికాగో ఆంధ్ర ప్రతిష్టానం (CAF-Chicago Andhra Foundation) కలిసి $26,750.00 డాలర్ల చెక్ ను కిరణ్ గారికి అందించారు. చికాగో ఆంధ్ర సంఘ చైర్మన్ సుజాత అప్పలనేని ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మరియు శ్రేయోభిలాషుల సహకారంతో ఈ నిధిని సమకూర్చడం జరిగింది. ఈ మొత్తాన్ని భారతదేశంలో నివసిస్తున్న  కాందిశీకుల కుటుంబాలలోని అర్హులైన మహిళలకు ఎంబ్రాయిడరీ అల్లిక పనులలో శిక్షణ, వనరుల సమకూర్పు, తద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం, మరియు వారి కుటుంబాలకు తక్కువ వనరులతో త్వరగా వంట చేయటానికి ఉపయోగపడే చూలా ప్రాజెక్ట్ కోసం, మరియు అరకు లోయలోని దాబుగూడ లో నిర్మించిన పాఠశాల నిర్వహణకు ఈ విద్యా సంవత్సరంలో అవసరమైన ఖర్చులకోసం వినియోగానికై అందజేయడం జరిగింది.

కిరణ్ గారు మాట్లాడుతూ పొరుగుదేశాల నుంచి భారత్ కు కాందిశీకులుగా వచ్చిన ప్రజల కష్టాలను, వారి దయనీయమైన జీవితాలను వివరిస్తూ వారికి కనీస సౌకర్యాలను, గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం అందరి సహకారాన్ని అర్థించారు. సంఘ పూర్వ అధ్యక్షులు శ్రీశైలేష్ మద్ది, అధ్యక్షులు మాలతి దామరాజు, ఉత్తరాధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి అరకులోయ లోని గూడేలలోమరిన్ని పాఠశాలలు నిర్మించటానికి అవసరమైన నిధులను విరాళం ప్రకటించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటానికి అధ్యక్షులు మాలతి  దామరాజు తో పాటు ఉపాధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, కార్యదర్శి శ్వేత కొత్తపల్లి, CAF కార్యనిర్వాహక సభ్యులు రామకృష్ణ తాడేపల్లి, సహ కోశాధికారి రామారావు కొత్తమాసు, పూర్వ అధ్యక్షులు శ్రీ శైలేష్ మద్ది, కార్యవర్గ సభ్యులు ఉష కొత్త ,  ట్రస్టీ పద్మారావు అప్పలనేని కృషిచేసారు. యోగ శిబిరాన్ని నిర్వహించిన కిరణ్ చుక్కపల్లి గారికి, మరియు స్థలం మరియు వసతులు అందించిన Mall of India యజమాని వినోజ్ చనుమోలు గారికి, Mall of India మేనేజర్ ప్రమోద్ చింతమనేని గారికి, సంఘ కార్యవర్గసభ్యులకు, ఈ శిబిరానికి హాజరైన వారందరికి ప్రెసిడెంట్ మాలతి దామరాజుగారు ధన్యవాదాలు తెలియ జేశారు.

 

Tags :