అయోధ్య నుంచి యోగీ పోటీ?

అయోధ్య నుంచి యోగీ పోటీ?

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో ఆయన అయోధ్య నుంచి పోటీ చేస్తారన్న పార్టీ వర్గాలతో పాటు రాజకీయ పండితులూ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ విషయం మరింత రూడీ అవుతోంది. యోగి కచ్చితంగా అయోధ్య నుంచే పోటీ చేస్తారని బీజేపీ ఉన్నత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు యోగి ఆదిత్యనాథ్‌ తో కూడిన బీజేపీ కోర్‌ కమిటీ ఢల్లీిలో సమావేశమైంది. అయోధ్య నుంచి యోగి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.  హిందువులకు మతపరమైన ప్రాధాన్యత ఉన్నందున ఆదిత్యనాథ్‌ను అయోధ్య లేదా మధుర నుంచి పోటీకి దింపాలని డిమాండ్‌ పెరుగుతోంది.

 

Tags :