సీఎం యోగి మరో కీలక నిర్ణయం.. అక్కడ తప్పనిసరి

సీఎం యోగి మరో కీలక నిర్ణయం.. అక్కడ తప్పనిసరి

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ కౌన్సిల్‌ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ త్రిపాఠి తెలిపారు.  జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరితో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు.

 

Tags :