యంగ్ హీరోలతో వెంకీ, నాగ్ పోటీ పడతారా?

సంక్రాంతికి ఇంకా తొమ్మిది నెలలు టైమ్ ఉండగానే అప్పుడే పండగ సీజన్ ను లాక్ చేసేసుకుంటున్నాయి పెద్ద సినిమాలు. లేట్ అయితే మళ్లీ మంచి డేట్ మిస్ అవుతుందనే ఉద్దేశంతో పెద్ద హీరోల సినిమాలన్నీ ముందుగానే కర్చీఫ్ వేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట కె సినిమా జనవరి12న రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు.
మహేష్- త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మహేష్28వ సినిమా జనవరి 13ని ఫిక్స్ చేసుకుంది. వీటితో పాటు రామ్ చరణ్- శంకర్ ల గేమ్ ఛేంజర్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా రేసులో ఉంటే పోటీ మరింత రసవత్తరంగా సాగుతుంది. లేదంటే మెగాఫ్యాన్స్ సమ్మర్ వరకు ఆగాల్సిందే.
అయిత ఈ సారి సంక్రాంతి రేస్ ఇక్కడితో ఆగేలా లేదు. విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్న సైంధవ్ సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. ఈ వారంలో షూటింగ్ మొదలుపెట్టనున్న సైంధవ్, భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. సినిమా ఫినిష్ అవడానికి ఎలాగూ ఆరేడు నెలల టైమ్ పడుతుంది కాబట్టి ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగితే బాగుంటుందనే దానిపై చర్చిస్తున్నారట టీమ్. త్వరలోనే దీనిపై డెసిషన్ తీసుకోనున్నారు.
వీటితో పాటుగా కింగ్ నాగార్జున, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ మూవీ కూడా ఈ బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనేది ఇన్ సైడ్ టాక్. దీని కోసం ఆల్రెడీ నాగ్ లుక్ కూడా ఛేంజ్ చేసుకున్నారు. మలయాళం హిట్ పొరింజు మరియంజొస్ మూల కథను తీసుకుని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఆ కథను మార్చినట్లు తెలుస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన నాగ్ సినిమాలు మంచి విజయాలుగా నిలవడంతో నాగ్ కన్ను జనవరి మీదే ఉందట. మరి ఇంత పెద్ద సినిమాల మధ్య అది కూడా యంగ్ హీరోలతో నాగ్, వెంకీ రిస్క్ తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.