ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ : వైఎస్ జగన్

ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ : వైఎస్ జగన్

అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీకైన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి  తెలుసుకున్నారు. విషవాయువు లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కారణాలను వెలికితీయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలన్నారు.

 

Tags :