వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా : వైఎస్ జగన్

వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా : వైఎస్ జగన్

రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతో భూములు సర్వే జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగనన్న భూహక్కు-భూరక్ష పథకం రెండోదశను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ భూ హక్కు పత్రాలను అందించే ముహత్తర కార్యక్రమం ఇది అని అన్నారు. రాష్ట్రంలోని భూములన్నీ కొలతలు వేసే కార్యక్రమమిది. మహాయజ్ఞంలా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. మొదటి దశలో రాష్ట్రంలోని 2 వేల గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేస్తామన్నారు.                                                              

రెండో దశ 2023 ఫిబ్రవరి నాటికి మరో 4 వేల  గ్రామాల్లో, మూడో దశలో 2023 మే నాటికి 6 వేల గ్రామాల్లో, నాలుగో దశలో ఆగస్టు నాటికి 9 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు అందజేస్తామన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.  గ్రామాల్లో భూములు అమ్మకాలు, కొనుగోళ్లు గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. మంచి జరిగితే అండగా నిలబడండి.  ప్రతి ఇంటికీ మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానం పెట్టుకొండి. ప్రతిపక్షాలు చెప్పు అబద్దాలు నమ్మొద్తు అని సూచించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.