ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు

ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.  గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్‌ అయిన వారందర్నీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతకం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.  ఇక సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్‌ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు సమాచారం.

 

Tags :