దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

బెజవాడ కనకదుర్గమ్మకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను ముఖ్యమంత్రి సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు పరివట్టం కట్టి తలపాగా చూట్టారు. పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి తలపై పెట్టగా వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్‌ జగన్‌ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి వేద పండితులు అశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 

Tags :