విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు : వైఎస్ జగన్

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు : వైఎస్ జగన్

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన బతికే శక్తి చదువుకే ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ సమాజం, దేశం, మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉందని అన్నారు. చదువే నిజమైన ఆస్తి అని గ్రహించాలన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి చదువు అందాలన్నదే నా తపన అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. మంచి చదువు హక్కుగా అందించాలన్నదే లక్ష్యం. జగనన్న అమ్మఒడి అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి పేద తల్లి ఖాతాలో జమ చేస్తున్నాం. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తున్నాం. 40 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకే ఉందని అన్నారు. జగన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశాం. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువు మధ్యలో ఆపకూడదు. బాగా చదవాలనే కనీసం 75 శాతం హాజరు తప్పనిరి చేశామన్నారు. పాఠశాలలు, టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌ కింద కాసింత సొమ్ము వసూలు చేస్తున్నాం. రూ.2 వేల వస్తూలు చేస్తుంటే కొంతమంది విమర్శిస్తున్నారు అని అన్నారు.

 

Tags :