ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక కళాశాల : వైఎస్‌ జగన్‌

ప్రతి  లోక్‌సభ నియోజకవర్గానికి ఒక  కళాశాల : వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ, విశాఖలో హైఎండ్‌ స్కిల్‌ వర్సిటీని పెట్టబోతున్నట్లు తెలిపారు. విశాఖ హైఎండ్‌ స్కిల్‌ వర్సిటీ పనులు వెంటనే  ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడంతో వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నైపుణ్యాలు పెంచే కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మెడికల్‌ కాలేజీల గదుల నిర్మాణంలో వినూత్న పద్ధతలు పాటించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రైవేట్‌ ఐటీఐల్లో కనీస సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికేషన్‌ చేయించాలని వెల్లడిరచారు. ప్రభుత్వ ఐటీఐల్లో బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలన్నారు. పదో తరగతి మానేసిన యువకులు నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా వారికి కేటాయించాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశాం. ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందిన వారికి అప్రెంటిన్‌షిప్‌ వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 

Tags :